పంట టోకెన్ల కోసం రైతుల గలాస
జొన్న పంట టోకెన్ల కోసం ఎగబడుతున్న రైతులు
కుబీర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో(Kubheer Mandal) జొన్న పంట పండించిన రైతులు పంట అమ్ముకోవడానికి తిప్పలు పడుతున్నారు. నిర్మల్ జిల్లాలో(Nirmal District) జొన్న పంట సాగుచేసిన రైతులకు ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గుంటలుకు 3400 చెల్లించడంతో ప్రభుత్వం మద్దతు ధర కోసం రైతులు పంట టోకెన్లను దారి చూస్తుంది.
కుబీర్ మండల కేంద్రంలో శనివారం టోకెన్లు ఇస్తున్నారని రైతులకు తెలపడంతో వందలాదిగా తరలివచ్చారు. క్యూ లైన్ లో నిలబడ్డ రైతులు టోకెన్ వస్తుందో లేదో అని ఒకరిని పై ఒకరు నెట్టుకుంటూ కోకిల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మైలా రైతుల సైతం టోకెన్ల కోసం కోసం తోపులాడుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పహారమధ్య టోకెన్లను జూలైలో నిలబడ్డ రైతులకు పంపిణీ చేశారు.








