11-08-2025 12:33:09 AM
కొండాపూర్/మునిపల్లి/టేక్మాల్, ఆగస్టు 10 : ఈనెల 13వ తేదీలోగా 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్న రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని సంగారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ వై ప్రభు, మునిపల్లి మండల వ్యవసాయ అధికారి అనితారెడ్డి, టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ వేర్వేరుగా తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదవశాత్తు భూమి ఉండి రైతులు మరణిస్తే ఈ బీమా పథకం కింద రూ.5 లక్షలు వర్తిస్తుం దని అన్నారు. రైతు బీమా చేసుకోని రైతులు జూన్ 5, 2025 నాటికి రిజిస్ట్రిటేషన్ అయిన వారి డేటా భూభారతి పోర్టల్ నుండి వ్యవసాయ శాఖ అధికారి వద్ద ఉందన్నారు. ఆగస్టు 13వ తేదీలోగా క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిని రైతు వేదికలో కలిసి రైతుబీమాకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే రైతు బీమాలో తప్పుల సవరణకు ఈనెల 12 వరకు అవకాశం ఉందన్నారు. ఇది వరకే దరఖాస్తు చేసుకున్న రైతులు మరల దరఖాస్తు చేసుకోవలసిన అవసరంలేదన్నారు.