11-08-2025 12:33:09 AM
బిచ్కుంద, ఆగష్టు 10 (విజయక్రాంతి): కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు రైతు బీమా కోసం దరఖాస్తులు ఈనెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని మద్నూర్ ఎవో రాజు ఆదివారం ఓ ప్రకటన లో తెలి పారు. అయన మాట్లాడు తూ... జూన్ 5వ తేదీ వరకు పట్టాదారు పాస్ బుక్ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవ కాశం ఉందన్నారు.
అర్హులైన రైతులు పట్టా దార్ పాస్ బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు దరఖాస్తుకు తప్పనిసరిగా జతపరచాల్సి ఉంటుంద న్నారు. అంతకు ముందు బీమా చేసుకోని రైతులు కూడా ఈ స్కీమ్ కు అప్లయ్ చేసుకోవచ్చు. 59 ఏళ్లు దాటితే ఈ స్కీమ్ వర్తించదన్నారు. గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.