11-08-2025 12:32:05 AM
కాగజ్‌నగర్ ఆగస్టు 10 (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని దహేగాం మండ లం ఐనం గ్రామ రైతులు ఆదివారం కాగజ్ నగర్ విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో లోఓల్టేజి సమస్యతో పంట పొలాలకు నీళ్లు అందక ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదన్నారు.
ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదన్నారు. తమ సమస్య పరిష్కారించే వరకుఇక్కడినుండి కదిలేది లేదని విద్యుత్ కార్యక్రమం ముందు ధర్నాకు దిగారు. విద్యుత్ అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.