రైతులకు నష్టపరిహారం అందించాలి
21-05-2024 03:00 AM
సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే సత్యనారాయణ వినతి
జయశంకర్ భూపాలపల్లి, మే 20(విజయక్రాంతి): అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డ్డిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. హైదరాబాద్‌లోని సచివాలయం లో సోమవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి అందించాచు. భూపాలపల్లి నియోజకవర్గ రైతులు ఎంతోమంది నష్టపోయారన్నారు. వారి వెంట మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరలు ఉన్నారు.






