24-04-2025 01:11:08 AM
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సును వేములవాడ రూరల్ మండలం హన్మాజిపేటలో బుధవారం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజర య్యారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ,భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సరైన ప్రణాళికతో భూభారత చట్టాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. భూ సమస్యలతో బాధపడే వారంతా చట్టాన్ని సద్వినియం చేసుకొని హక్కులు పొందాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు నిచ్చారు. హన్మాజీపేట్ పేట బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిం దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏ ఎమ్ సీ చైర్మెన్ రొండి రాజు, వేములవాడ అర్బన్, రూరల్ తహసీల్దార్లు విజయ్ ప్రకాష్ రావు, అబూ బాకర్, వ్యవసాయ అధికారి సాయి కిరణ్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న రైతులు తదితరులు ఉన్నారు.