calender_icon.png 3 December, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి

03-12-2025 04:49:03 PM

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్..

కాటారం (మల్హర్) (విజయక్రాంతి): రైతులకు అవసరమైన సదుపాయాలు పీపీఎసీల వద్ద తాగునీరు, నీడ, కొలతల యంత్రాలు, పారదర్శక తూకం పరికరాలు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం మల్హార్‌రావు మండల పరిధిలోని రుద్రారం, యడ్లపల్లి, కొయ్యూరు, కొండంపేట్, వల్లంకుంట, తాడిచర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. 

రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోనకుండా, కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జీలకు స్పష్టం చేశారు. కొనుగోలు కార్యక్రమంలో పారదర్శకత, సత్వర స్పందన, రైతులకు సేవాభావం పిపిసీ ఇన్‌చార్జీల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. సందర్శనలో గుర్తించిన చిన్నపాటి లోపాలను తక్షణమే సరిదిద్దాలని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రభుత్వం సూచించిన విధంగా పారదర్శకంగా, వేగవంతంగా కొనుగోలు కార్యకలాపాలు కొనసాగాలని తెలిపారు. కేంద్రాల ఇంచార్జిలు కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా బాధ్యతతో సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. 

ట్యాబ్ ఎంట్రీలు  తప్పనిసరి

ప్రతి పీపీసీ కేంద్రంలో రోజువారీ వరి కొనుగోలు వివరాలు, తరలింపు వివరాలు, రైతులకు చెల్లింపుల పురోగతి ట్యాబ్‌లో ప్రతిరోజూ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ఆలస్యం లేదా తప్పిదాలకు సంబంధిత ఇన్‌చార్జ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోటీసు బోర్డు  రిజిస్టర్ల సంరక్షణ. ప్రతి కేంద్రంలో అధికారిక సమాచారం రోజువారీ కొనుగోలు గణాంకాలు, రేట్లు, రైతుల వివరాలు, నోటీసు బోర్డు మీద స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. పర్చేజ్ రిజిస్టర్, రైతుల సమాచార రిజిస్టర్‌లను సక్రమంగా, ప్రతిరోజూ అప్‌డేట్ చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎస్ఓ కిరణ్‌కుమార్, తహసీల్దార్ రవికుమార్, వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.