calender_icon.png 3 December, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు సేవలను అందించడమే ఎంఐఎం లక్ష్యం

03-12-2025 04:52:32 PM

ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్..

కరీంనగర్ (విజయక్రాంతి): పేద ప్రజలకు సేవలను అందించడమే ఎంఐఎం లక్ష్యమని ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించే రేషన్ బియ్యం వారి ఇంటి వద్దకు ఇబ్బంది కలగకుండా చేరవేయడం కోసం నగరంలోని 34 డివిజన్ బొమ్మకల్ సలఫీ నగర్, విజయనగర్ కాలనీ, హుస్సేనీపుర ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం 34వ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ ఖాజా మజారుద్దీన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఏర్పాటుచేసిన ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఐఎం పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కుల మతాలకు తేడా లేకుండా సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.

తన సొంత ఖర్చులతో డివిజన్ ప్రజల సౌకర్యార్థం ఆటోలను ఏర్పాటు చేయడంతో పాటు సైడ్ డ్రైనేజీనీ ముంపునకు గురి కాకుండా నిర్మించడం అభినందనీయమని, ఖాజా మజారుద్దీన్ వంటి ప్రజా నాయకుడు డివిజన్ ప్రజలకు సేవలందించడం డివిజన్ ప్రజల అదృష్టం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆరిఫ్ అహ్మద్, డివిజన్ అధ్యక్షులు సాజిద్, తాజుద్దీన్, లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాజిద్, సుధాకర్, నరేశ్, సుదర్శన్, శ్రీనివాస్, చరణ్, చిన్నా, రజాక్, యాఖూబ్, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.