4 April, 2026 | 2:58 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

అగ్గి తెగులుతో అప్రమత్తం

10-02-2026 06:11 PM

- బీరెల్లి గూడెంలో వరి పొలాల పరిశీలన

- మండల వ్యవసాయ అధికారిని ఎస్ పద్మజ

మునుగోడు,(విజయక్రాంతి): రైతులు వరి పంటలో అగ్గి తెగులు పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారిని ఎస్.పద్మజ అన్నారు. మంగళవారం మండలంలోని బీరెల్లి గూడెం గ్రామంలో వరి పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించి మాట్లాడారు. వరి పంటలో అగ్గి తెగులు, ఇతర పురుగు తెగుళ్లు ఉన్నట్లు గుర్తించారు. అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ 75% డబ్ల్యూపి 160 గ్రాములు,సాఫ్ 200 గ్రాములు ఒక్కో ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.

జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా సుడోమోనాస్ ఫ్లోరిసిన్స్ బ్యాక్టీరియాను ఒక లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.నాట్లు వేసిన నెల రోజుల తర్వాత పురుగుల నియంత్రణకు గుళికలు వేయడం వల్ల ప్రయోజనం ఉండదని, కావున గుళికలను ఉపయోగించకుండా స్ప్రే మందులను మాత్రమే వాడాలని అధికారులు సూచించారు.

అలాగే పురుగుల మందులతో పాటు వేప నూనె కలిపి పిచికారీ చేయడం వలన మందుల ప్రభావం సుమారు 25 శాతం వరకు పెరుగుతుందని వివరించారు.జీవామృతం తయారీ విధానం మరియు దాని ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి ఎం. నరసింహ,రైతులు దోటి వెంకన్న, దోటి సైదులు ఉన్నారు.