17-07-2025 01:36:13 AM
జిల్లా కలెక్టర్ దివాకర
ములుగు, జూలై16(విజయక్రాంతి): ములుగు జిల్లాలోని రైతులు ఆయిల్ ఫాం సాగుకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ కోరారు బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆయిల్ పామ్ సాగుపై వ్యవసాయ,ఉద్యాన శాఖలతో సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు రైతులకు లాభదాయకమని వ్యవసాయ ఉద్యాన శాఖలు సంయుక్త కృషితో 2025-26 సాగు లక్ష్యాలను పూర్తి చేయాలనీ తెలిపారు. అలాగే మండల వ్యవసాయ అధికారి వారిగా సాగు లక్ష్యాలను నిర్దేశించి,పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.
జిల్లాలో మండలాల వారిగా ఏఈఓ క్లస్టర్ వారిగా 5ఎకరాలు పైబడిన రైతుల వివరాలను,బోరు సౌకర్యం కలిగిన రైతులను గుర్తించి ప్రతి ఒక్కరిని ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు.ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో మొత్తం 5000 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని,నిర్దేశించిన టార్గెట్లను పూర్తి చేయాలని సూచించారు.