17-07-2025 01:34:32 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 16 (విజయ క్రాంతి): టీబీని వ్యాధిని నిర్మూలించడలో సమిష్టి కృషి అవసరమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం ఐడిఓసీ కార్యాలయంలోని టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, సింగరేణి వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థతో పాటు ప్రైవేట్ వైద్యుల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. టీబీ వ్యాధి గ్రస్థులను త్వరితగతిన గుర్తించి వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఇంఛార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ఉమారాణి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ కుమార్, సింగరేణి సూపరింటెండెంట్ డాక్టర్ గోపి, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాస్, శ్రీదేవి, ఎక్స్ రే యూనిట్ల నిర్వాహకులు పాల్గొన్నారు.