రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
కలెక్టర్ కుమార్ దీపక్
కాసిపేట, జూలై 28 : ఎల్ నినో ప్రభావంతో వరి సాగు కష్టతరమైన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ తక్కువ నీటి అవసరం గల పంటలను సాగు చేసి లబ్ధి పొందాలని సూచించారు. మండల కేంద్రంలోని కేజీబీవీని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాసిపేట ఏఓ ప్రభాకర్ రెడ్డి, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






