23 April, 2026 | 2:04 PM

Breaking News

అనుబంధ రంగాలపై రైతులు దృష్టిపెట్టాలి

27-06-2024 12:58 AM
  • కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి, జూన్ 26 (విజయక్రాంతి): రైతులు వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై దృష్టిసారించాలని, అప్పుడే ఆర్థికాభివృద్ది పొందుతారని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కామారెడ్డిలో  నిర్వహించిన కిసాన్‌మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా పథకాలు అమలు చేస్తూ సబ్సిడీ అందిస్తున్నదని చెప్పారు. బ్యాంకర్లు ఉదారంగా రుణాలు అందించి రైతులకు చేయూతనివ్వాలని కోరారు.   

వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, కోళ్లు, చేపల పెంపకం, ఆయిల్‌పామ్ తోటల పెంపకంపై రైతులు దృష్టిసారించాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ శరత్, కోరుట్ల పశు వైద్యకళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్, ఎన్‌ఆర్‌ఏంఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బస్వారెడ్డి, జిల్లా పశు సంవర్థక శాఖధికారి సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి, విజయడైయిరీ డిప్యూటీ డైరెక్టర్ నందకుమారి తదితరులు పాల్గొన్నారు.