29 May, 2026 | 2:54 AM

ఘనంగా పెద్దమ్మ బోనాలు

29-05-2026 12:35 AM

రుద్రంగి మే 28 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని పడమటివాడ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. సంఘం తరపున బోనలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించడం జరుగుతుందని అన్నారు. ఆ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.