calender_icon.png 12 September, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నాల జీపీనీ మున్సిపాలిటీలో విలీనం చేయోద్దు

12-09-2025 05:27:08 PM

బెల్లంపల్లి అర్బన్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ (జీ పీ)నీ మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, కాంగ్రెస్ నాయకులతో కలిసి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ ను కలిపి కోరారు. ఈ మేరకు శుక్రవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కి వినతిపత్రం పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కన్నాల గ్రామపంచాయతీని బెల్లంపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయొద్దన్నారు. కన్నాల గ్రామ ప్రజలు 80% ఉపాధి హామీ 100 రోజుల ప్రభుత్వ పనిపైన ఆధారపడి ఉన్నారన్నారు.  మున్సిపాలిటీలో విలీనం చేస్తే ఉపాధి హామీ పథకం కోల్పోతారని వాపోయారు.  పేద ప్రజలకు జీవనోపాధికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రజల సంక్షేమం రీత్యా కన్నాల జీపీని బెల్లంపల్లి మున్సిపాలిటీలో కలపొద్దని కోరారు. కన్నాల గ్రామ ప్రజల ఆకాంక్షలను అధికారులు పరిగణoలోకి తీసుకోవాలన్నారు.