calender_icon.png 16 October, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

15-10-2025 09:54:08 PM

తహసిల్దార్ కవిత..

గరిడేపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తహసిల్దార్ బండ కవిత కోరారు. బుధవారం మండలంలోని పొనుగోడు గ్రామంలో ఖరీఫ్ సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం అమ్మేందుకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలని కోరారు. కార్యక్రమంలో పిఏ సిఎస్ చైర్మన్ జె కమల, మండల వ్యవసాయ అధికారి ప్రియతమ కుమార్, ఏఈఓ మనోజ్ కుమార్, ఆడిటర్ నారాయణస్వామి, రాజు సంగం సెక్రటరీ అందే ఉపేందర్, పిఎసిఎస్ సిబ్బంది, పలువురు రైతులు తదితరు పాల్గొన్నారు.