calender_icon.png 16 October, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 25న హుజూర్ నగర్ మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

15-10-2025 09:55:46 PM

సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తాం

బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం

ఆల్మట్టి ఎత్తు పెంపును అంగీకరించబోం

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగు, దిగుబడి 

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

కోదాడ: ఈనెల 25న హుజూర్ నగర్ జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోదాడ పట్టణంలో నిర్వహించిన కోదాడ & హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై మాట్లాడారు. కృష్ణ, గోదావరి నది జలాలపై ప్రభుత్వం సమర్ధవంతంగా ముందుకు వెళ్తుందన్నారు.  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ స్థాయిలో వరి పంట పండుతుందన్నారు. 29 రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఎక్కువ వరి పంట సాగు జరుగుతుందన్నారు. రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించామన్నారు. 67 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేయడం జరుగుతుంది.87వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కొనుగోలు చేసిన దాఖలు లేవన్నారు.  ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమన్వయంతో కృష్ణ,గోదావరి జలపై చిత్తశుద్ధితో సమీక్ష చేస్తూ ముందుకెళ్తున్నారన్నారు. బనకచర్ల ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం, మేము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొ1న్నారు.  బీఆరెస్ పార్టీ వితండవాదం వినిపిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి వాటిలో 80% తెలంగాణకి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మీదు ఒత్తిడి చేయడం జరుగుతుందన్నారు. ఎస్ ఎల్ బి సి టన్నెల్ ను పునః ప్రారంభించి వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. 

ముఖ్యమంత్రి తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి దినకర్మకి వచ్చిన సందర్భంగా ఎస్ ఆర్ ఎస్ పి రెండోవ పేస్ 2కి దామోదర రెడ్డి పేరు పెట్టడం సంతోషకరం అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్నారు. నది జలాల వినియోగంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా శక్తివంచన లేకుండా పనిచేస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నామమాత్రంగా సాగు నీరు అందుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. బీఆర్ ఎస్ పాలనలో డిండి ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఏఐసీసీ అబ్జర్వర్ గా ఒరిస్సా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ శరత్ రావత్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, చెవిటి వెంకన్న, లక్ష్మీనారాయణరెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు,  నాయకులు, అధికారులు పాల్గొన్నారు.