calender_icon.png 16 October, 2025 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్

15-10-2025 09:52:10 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ - తెలంగాణ కార్యక్రమం థీమ్ టీపీసీసీ ఆదేశాల మేరకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోదెం వీరయ్య ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం క్లబ్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడం, కాంగ్రెస్ పార్టీ ఆత్మలోని ఈ ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెట్టే ప్రయత్నంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోందనీ ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహయం రఘురాం రెడ్డి, ఏఐసీసీ అబ్జర్వర్ శ్రీ జాన్సన్ అబ్రహం, టీపీసీసీ అబ్జర్వర్లు ఈడ్పుగంటి సుబ్బారావు, సాగరిక, సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. అబ్జర్వర్లు మాట్లాడుతూ... ప్రజలలో నుండి ప్రజానాయకులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం. ప్రతి జిల్లాలో స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నాయకుడితో వ్యక్తిగతంగా చర్చించి, వారి అభిప్రాయాలను టీపీసీసీ, ఏఐసీసీకి పంపుతాం. ఈ విధానంతో పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది అని పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థాయి నాయకులతో వ్యక్తిగతంగా అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సేకరించిన అభిప్రాయాలను టీపీసీసీకి సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు, పట్టణ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.