ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
వనపర్తి, అక్టోబర్ 29 ( విజయక్రాంతి ) : రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్ర భుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేం ద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల మార్కెట్ యార్డ్ లో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మేఘా రెడ్డితో కలిసి ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చే సిన వరి కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆ వెంటనే వరి ధాన్యం సంచిని తూకం చేసి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్ర భుత్వ ధ్యేయమని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర ల భిస్తుందని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే తెలియజేశా రు. ప్రభుత్వం సన్న రకాలకు రూ. 500 బో నస్ ఇస్తుందని చెప్పారు. కాబట్టి రైతులు ప్ర భుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరి ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
వరి ధా న్యం విక్రయించడానికి కొనుగోలు కేంద్రాల కు వచ్చే రైతులకు నిర్వాహకులు సహకరించాలని సూచించారు. అనంతరం కలెక్టర్, ఎ మ్మెల్యే అక్కడే ఉన్న వరి ధాన్యం ఆరబెట్టే యంత్రాన్ని పరిశీలించి దానికి సంబంధించి న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు, కొనుగోలు కేంద్రం ని ర్వాహకులు ఎమ్మెల్యే, కలెక్టర్ ని షాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో అదనకు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, డి ఆర్ డి ఓ ఉమాదేవి, మార్కెటింగ్ అధికారి స్వరన్ సింగ్, నాయకులు, ప్రజా ప్రతినిధు లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.






