మార్కెట్‌లో నీళ్లు నిలిచే..రైతులకు కన్నీళ్లు మిగిల్చే
- మొంథా తుఫాను ప్రభావం. ‘అర్ధరాత్రి నుండి వర్షం.. అంతులేని నష్టం’..
- ఒరిగిన వరిసెండ్లు.. మునిగిన పత్తి పొంగిపొర్లుతున్న చెరువులు కుంటలు,.. రోడ్లకు కోతలు
నకిరేకల్ అక్టోబర్ 29(విజయ క్రాంతి ): మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపు లేకుండా కురిసిన వర్షాలకు ఆరుగాలం శ్రమ ఫలించింది. పంట చేతికొచ్చింది. తేమ కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఆరబెట్టాం. ఒకటి రెండు రోజుల్లో కాంటాలు వేస్తే ఇక ఫలితం చేతికొచ్చినట్లే..’ అనుకున్న అన్నదాతలను మంగళవారం అర్ధరాత్రి నుండి బుధవారం ఎడతెరపి లేకుండా కురిసిన అకాల వర్షం అంతులేని నష్టాన్ని మిగిల్చింది.
నకిరేకల్ నియోజకవర్గంలో నష్ట తీవ్రత అధికంగా ఉందని రైతులకు వాపోతున్నారు. అకాల వర్షం తీవ్రంగా నష్టపోయిన రైతాంగం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, పట్టాలు నీట మునిగి ధాన్యం రాసులు తడిసి ముద్దాయ్యాయి. అనేక గ్రామాలలో పిఎసిఎస్ కోపరేటివ్ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరదనీరు కలవాలా పారుతున్న పరిస్థితి ఉన్నది. రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
అనేక గ్రామాల్లో పత్తి నీట మునిగిన పరిస్థితి ఉన్నది. తీసిన పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద మ్యాచర్ రాక ఆగిన పరిస్థితి ఉన్నది.. పెట్టిన పెట్టుబడులు చేతిన కష్టం చేతికి వస్తుందో రాదో ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రభుత్వం , అధికారులు స్పందించి చొరచూపి మ్యాచర్ తో సంబంధం లేకుండా తడిచిన ధాన్యాన్ని తడిసిన పత్తిని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నకిరేకల్ నియోజకవర్గంలో అనేక చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలో రెండో ప్రాజెక్ట్ అయిన మూసి నది నీటి కుండాల మారింది. 7 గేట్లు నాలుగు ఫీట్ల మేర పైకెత్తి 20,000 క్యూసీక్కులను నిటిని విడుదల చేశారు. కట్టంగూర్ పెద్ద చెరువు అలుగు పోస్తున్న పరిస్థితున్నది. నకిరేకల్ పెద్ద చెరువు నిండుకుండలా మారింది.
ఇవే కాదు అనేక గ్రామాల్లో చెరువులు కుంటలు నిండి పొంగిపొర్లుతున్న పరిస్థితి ఉన్నది. దీంతో అనేక గ్రామాల్లో నీటి ప్రవహిస్తున్న పరిస్థితి ఉన్నది. దీంతో గ్రామాలలోకి వెళ్లే రోడ్లు గుంతల మయంగా మారి నీటి కోతకు గురై థ్వంసానికి . ఈ అకాల వర్షం రైతులనే కాదు అన్ని రకాల వ్యాపారాలను నష్టం చేసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులని ప్రజలని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వలిగొండ..
వలిగొండ, అక్టోబర్ 29 (విజయక్రాంతి): ‘మొంథా‘ తుఫాన్ ప్రభావంతో వలిగొండ మండల వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. దీంతో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి.
తుఫాను ప్రభావంతో మూసీ ఎగువ ప్రాంతాల్లో మరియు మూసీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ పరవాళ్ళు తొక్కుతూ సంగెం-బొల్లేపల్లి గ్రామాల మధ్యగల కాజువే పైనుండి పరుగులు తీస్తుండడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తుఫాన్ ప్రభావంతో ముందు జాగ్రత్తగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ అధికారులు గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.
చెరువును తలపిస్తున్న ముష్టిపల్లి రహదారి
చండూరు,(నాంపల్లి) అక్టోబర్ 29 (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గం పరిధిలోని నాంపల్లి నుండి మల్లెపల్లి పోయే రహదారి మధ్యలో ముష్టిపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.అకాల వర్షాలకు రోడ్లలో మొత్తం నీరు నిండిపోవడంతో చెరువుల తలపిస్తుంది.
దీనివలన వివిధ గ్రామాల ప్రజలు వాహనదారులు, చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీనిపై అధికారులు స్పందించి రోడ్డు భవనాల శాఖ ఎంబడే మరమ్మత్తులు చేపట్టాలని సంబంధింత అధికారులు స్పందించి. రోడ్లపై నీరు నిలువ లేకుండా చేయాలని నాంపల్లి మండల ప్రజలు కోరుకుంటున్నారు.
కోదాడ పట్టణ లోతట్టు ప్రాంతాలు జలమయం
కోదాడ అక్టోబర్ 29: తుఫాను కారణంగా కోదాడ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు బుధవారం జలమయంగా మారాయి. పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీ, హుజూర్ నగర్ రోడ్డులోని ఆపిల్ హాస్పిటల్ ఏరియా, కొత్త సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ఏరియా, భవానీ నగర్ ప్రాంతాలు జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది.
నాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ఇబ్బందులు పడ్డారు. గత సంవత్సరం ఇదే మాదిరిగా భారీ వర్షం కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నష్టపోయిన సంగతి తెలిసిందే. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చి, కాల్వ ఆక్రమణలు లేకుండా చూస్తే వర్షపు నీరు ఇళ్ళలోకి రాకుండా ఉంటుందని ప్రజలు అంటున్నారు.






