calender_icon.png 30 July, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలో.. యూరియా కోసం కష్టపడుతున్న రైతులు

30-07-2025 12:25:45 AM

బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి

గజ్వేల్, జులై 29 :  కాంగ్రెస్ ప్రభుత్వంలో  రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని బి ఆర్ ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. గజ్వేల్  తెలంగాణ ఆగ్రోస్ రైతు కేంద్రాన్ని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బిఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి మంగళవారం సందర్శించారు. రైతులు యూరియా కోసం పడుతున్న  బాధలను వంటేరు ప్రతాప్ రెడ్డికి చెప్పుకుంటూ ఆవేద వ్యక్తం చేశారు.   

ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ అబద్దాల పునాదుల మీద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూడా విఫలమైందన్నారు. రైతులు యూరియా కోసం గంటల తరబడి లైన్లో నిలబడిన దుస్థితిని చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.

సమయానికి సాగునీరందివ్వక, యూరియా, విత్తనాలు అవసరం మేరకు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, రైతు వ్యతిరేకంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వెంటనే గజ్వేల్ నియోజకవర్గం లోని రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం సి రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాధసు శ్రీనివాస్, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా,

మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి , కౌన్సిలర్ గుంటూకు రాజు, మరికంటి కనకయ్య, మల్లేశం, శ్రీధర్, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింగరావు, భూపాల్ రెడ్డి,పాల రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, అహ్మద్, స్వామి చారి తదితరులు పాల్గొన్నారు.