30-07-2025 12:24:12 AM
కొండపాక, జూలై 29 : కొండపాక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను
పాఠశాల పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు మంగళవారం సందర్శించారు. పాఠశాల నిర్వహణ తీరును పరిశీలించి మధ్యాహ్న భోజన మెనూ ప్రకారం అందివ్వాలని సూచించారు. ఈ సంవత్సరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడం కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను ఆయ న అభినందించారు. విద్యార్థులు ఉపాధ్యా యులు వంద శాతం హాజరై మంచి ఫలితాలు సాధించాలన్నారు.
తరగతి గది బోధనలో బోధనా ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, విద్యార్థులలో మంచి అలవా ట్లను పెంపొందించాలని సూచించారు. ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థులపై అత్యధికంగా ఉంటుందని చెప్పారు. పాఠశాలలో అమలు చేస్తున్న ‘స్టార్ ఆఫ్ ది వీక్‘, ‘లిటిల్ టీచర్‘, ‘పియర్ గ్రూప్ లెర్నింగ్‘ వంటి వినూత్న కార్యక్రమాల పట్ల అభినందనలు తెలిపారు. నోట్స్ కరెక్షన్ చేయడం వల్ల విద్యార్థులపై అవగాహన కలుగుతుందని, తప్పులను సరిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సూచించారు.
పాఠశాల మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం పట్ల ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ప్రోత్సహించారు. రాష్ట్రంలోనే నంబర్ వన్ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్గాలను అవలంబించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారి రంగనాథ్, ప్రధానోపాధ్యాయులు బి. విఠల్ నాయక్ ఉపాధ్యాయులు ఉన్నారు.