11-11-2025 04:52:03 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): తుఫాన్ బీభత్సంతో తుంగతుర్తి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలోని రైతులకు ధాన్యం చేతికి వచ్చే సమయంలో, పైరు మొత్తం నేలకు వంగి, నీటి ప్రవాహంలో ఉండడంతో కొందరు రైతుల పొలాల్లో ఏకంగా ధాన్యం మలకలు తేలాయి. దీనితో రైతు వరి కోత మిషన్ తో కోయడానికి కూడా వీలుపడకుండా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన నాలుగు ఎకరాలు వరి పైరు సాగు చేసిన, అంబటి యాకయ్య అపార నష్టం చోటు చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి, తుఫాన్ తాకిడికి నష్టపోయిన రైతులకు, ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.