calender_icon.png 11 November, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్ కు వినతి

11-11-2025 04:50:05 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య పరిష్కరించాలని ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు ఎర్ర విజయ రావు ఆధ్వర్యంలో కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ వాడ, వీకర్ సెక్షన్ కాలనీలలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండు మూడు రోజులకోసారి నీరు వస్తోందని పేర్కొన్నారు. తాము రెక్కాడితే గాని డొక్కాడని కూలీలమని ట్యాంకర్ నీరు కొనుగోలు చేసుకోలేమని తెలిపారు. నీటి సమస్యను రెండు మూడు రోజులలో పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని విజయ రావు తెలిపారు. నరేందర్, కొమ్ము రాజు, జహంగీర్, షేక్ ఇస్మాయిల్ తదితరులు వినతిపత్రం సమర్పించారు.