calender_icon.png 11 November, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏటీసీతో ఉపాధి అవకాశాలు మెరుగు

11-11-2025 04:54:16 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..

మండేపల్లిలోని ఏటీసీ కేంద్రంలో పరిశీలన..

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)తో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని ఏటీసీ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. ఏటీసీలోని సీఎన్ సీ మ్యాచింగ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్, మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియన్, మెకానిక్ ఎలెక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ ఎఫ్ఈఎం కోర్సుల్లో బాగంగా వివిధ యంత్రాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? విద్య బోధన, ప్రాక్టికల్ అంశాలపై పలు ప్రశ్నలు అడిగి వివరాలు తెలుసుకున్నారు.

మొత్తం ఎంత విద్యార్థులు చదువుతున్నారని ప్రిన్సిపాల్ ను అడగగా, 172 మంది విద్యార్థులకు గాను 166 మంది చదువుతున్నారని ఇంచార్జి కలెక్టర్ దృష్టికి ప్రిన్సిపాల్ తీసుకెళ్లారు. వివిధ కోర్సుల ల్యాబ్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. యువత ఏటీసీ సెంటర్లు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తరగతులకు వచ్చే విద్యార్థులు ప్రతి అంశాన్ని లోతుగా తెలుసుకోవాలని, ప్రాక్టికల్ ను కూడా నిత్యం సాధన చేయాలని సూచించారు. ఈ దశలో నేర్చుకున్న అంశాలు ఉద్యోగానికి, వృత్తి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతి నిముషం విలువైనదని, తరగతులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ కవిత, తహసీల్దార్ జయంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.