లారీల కొరతతో రోడ్డెక్కిన రైతులు
మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఆందోళన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి మద్దతు
వెల్దుర్తి, మే 28: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపునకు లారీలు సరిగ్గా రావడంలేదని గురువారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని నర్సాపూర్ ప్రధాన రహదారిపై రైతులతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. ఐకెపి, పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పంట పండించిన సమయం కంటే కొనుగోలు సమయమే ఎక్కువగా అవుతుందని రాత్రి కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యం వలన కష్టపడి పం డించిన పంటలు వర్షాలతో నీటిపాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యంను తరగు పేరుతో మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో క్వింటాలుకు 3 నుండి 4 కిలోలు తరుగు తీయడంతో నష్టం వాటిల్లుతుందని వారు అన్నారు.






