రావిర్యాలలో గజం 83.5 వేలు
- ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ బోర్డు భూములకు రికార్డు ధరలు
- విక్రయాల ద్వారా రూ.140 కోట్లు ఆదాయం
హైదరాబాద్ , మే 28 (విజయక్రాంతి): రాజధాని క్యూర్ పరిధిలో పెద్దపెద్ద వెంచర్లు చేపట్టడానికి అనువుగా ఉన్న భూములకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. ఇందులో నూ ఎటువంటి వివాదాలు లేకుండా క్లియర్ టైటిల్‌తో ప్రభుత్వానికి చెందిన హౌసింగ్ బోర్డ్ స్థలాలకు డిమాండ్ మరింత భారీగా ఉంటున్నది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఫ్యూచర్ సిటీ ప్రారంభంలో ఎయి ర్ పోర్టుకు సమీపంలోని రావిర్యాలలో భూ ములను కొనుగోలు చేయడానికి అనేక మం ది పోటీపడ్డారు.
గురువారం ఈ ద్వారా వేలం నిర్వహించారు. మొత్తం నాలు గు స్థలాలకు నిర్వహించిన వేలం పాటలో చదరపు గజం గరిష్ఠంగా రూ.83,500లకు అమ్ముడు పోయిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. వెయ్యి నుంచి 13,500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న నాలుగు లాండ్ పార్సిళ్లకు నిర్వహించిన వేలం పాట ద్వారా సుమారు రూ.140 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. ఈ భూములను ఈ వేలంలో విక్రయిస్తున్న ట్టు గత నెలలో హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది.
ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 17 సంస్థలు పోటీ ప డ్డాయి. ఇందులో 1,113 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొనుగోలు చేయడా నికి బిడ్డర్లు పోటీపడ్డారు. రూ.26 వేల కనీస ధరను నిర్ధారించగా, దీనిని దక్కించుకోడానికి పోటీపడుతూ చదరపు గజం రూ.83, 500లకు ఓ డెవలపర్ సంస్థ దక్కించుకున్నది. ఇదే ప్రాంతంలోని సుమారు 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలోని స్థలం చదరపు గజం రూ.62,500 ధరకు అమ్ముడు పో యింది. సుమారు 13,500 చదరపు గజాల విస్తీర్ణంలోని స్థలం కొనుగోలుకు కూడా బిడ్డర్లు పోటీపడ్డారు.
నేడు కూడా ఈ వేలం..
కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్, చింత ల్ ప్రాంతాల్లోని మరో నాలుగు ప్లాట్లకు శుక్రవారం ఈ వేలం నిర్వహించనున్నారు. కేపీ హెచ్‌బీ కాలనీ ఫేజ్ 1 లోని 5,898 చదరపు గజాలు, 2,420 చదరపు గజాల్లోని ప్లాట్ నం 2, కుత్బుల్లాపూర్, చింతల్ లోని 10,890, చ.గ, 3,388 చదరపు గజాల భూములను విక్రయించనున్నారు.






