చలో ఆర్మూర్ కు వేలాదిగా రైతులు
24-08-2024 05:09 PM
నిజామాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): బేశరతుగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే, రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఇచ్చిన చలో ఆర్మూర్ భారీ స్పందన వచ్చింది. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మామిడిపల్లి చౌరస్తాలో, పార్టీలకతీతంగా వేలాది మంది రైతులు పోగయ్యారు. రుణమాఫీ పై శాంతియుతంగా తమ నిరసన తెలిపేందుకు 44 వ నెంబర్ జాతీయ రహదారి పై ఆందోళన చేపట్టారు. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు ప్రభుత్వం బేషరతులు షరతుగా రుణమాఫీ చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీసులు చలో ఆర్మూర్ అనుమతి లేదని తెలిపిన వేలాది మంది రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు ఆందోళనకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.






