విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: బెల్లంపల్లి ఏసిపి రవికుమార్
24-08-2024 05:11 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ కోరారు. శనివారం సెయింట్ మేరీస్ హై స్కూల్లో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు.
పోలీస్ శాఖ అమలు చేస్తున్న కొత్త చట్టాలపై ప్రతి విద్యార్థి అవగాహన పెంచుకోవాలని సూచించారు. యాంటీ డ్రగ్స్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఆయన బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె. మహేందర్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






