30-11-2024 07:20:38 PM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓపెన్ కాస్ట్ ను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి సింగరేణి జిఎం శ్రీనివాసులు కోరారు. శనివారం గోలేటి లోని సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ కాస్ట్ ప్రారంభానికి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ ప్రారంభమైతే ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రారంభానికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆర్ అండ్ ఆర్ కాలనీలో సౌకర్యాలు తదితర అంశాలపై సింగరేణి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం రాజమల్లు, ఏరియా సెక్యూరిటీ అధికారి ఉమాకాంత్, పర్సనల్ మేనేజర్ రెడ్డి మల్ల తిరుపతి, వివిధ సంఘాల నాయకులున్నారు.