7 May, 2026 | 3:09 AM

ఘనంగా రైతు వారోత్సవం

07-05-2026 01:39 AM

పెబ్బేరు, మే 6: మున్సిపాలిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ గౌని ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి అధ్యక్షతన రైతులకు సేవలు, వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని తెలిపారు. పంట మార్పిడి పద్ధతిని అనుసరించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర, సింగిల్ విండో చైర్మన్ గౌని కోదండ రాంరెడ్డి, వైస్ చైర్మన్ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారులు, ఎస్బీఐ మేనేజర్, మార్కెట్ కార్యదర్శి, సింగిల్ విండో సీఈఓ, ఏపీఎంలు, ఐకేపీ, మెప్మా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.