జనసమీకరణకు బీజేపీ చర్యలు
- ఎంపీలు, ఎమ్మెల్యేలకు టార్గెట్లు!
- రెండు లక్షల మందితో సభ సక్సెస్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవడ మే లక్ష్యంగా బీజేపీ తన దూకుడును పెంచిం ది. అందుకు ఈ నెల 10న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని భావిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలను- కుంటోంది. ఇందుకోసమే భారీగా జనసమీకరణను చేపడుతోంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే మొదటిసారి.
ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలను బీజేపీ రాష్ట్ర నాయ కత్వం అప్పగించింది. ప్రతి ఎంపీ, ఎమ్మెల్యేకు స్పష్టమైన జన సమీకరణ లక్ష్యాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్దేశించింది. ఉమ్మడి జిల్లా ల ఇన్-చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేలు నుంచి 10 వేల మందిని తరలించాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.
కేవలం నేతలే కాకుండా, బూత్‌స్థా యి కార్యకర్తలు కూడా ఇంటింటికీ వెళ్లి ప్రధాని సభకు ఆహ్వానిస్తున్నారు. ఈ బహిరంగ సభకు దాదాపు 2 లక్షలకు పైగా జనం తో భారీ ఎత్తున నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటి వరకు లక్షమంది హాజరయ్యే లా రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేసుకుంది. కానీ మరో లక్ష మందిని ఎలాగైనా తరలించాలని భావిస్తోంది. ఈ సభ నిర్వహణతో రాష్ట్రంలో గట్టిసంకేతాన్ని పంపాలని భావిస్తున్నారు. వీలైనంత వరకు ఎక్కువ మందిని గ్రేటర్ హైదరా బాద్ పరిధిలోనే జనసమీకరణ చేయనున్నారు.
పీఎం సభకు సీఎం హాజరు!..
ఇదిలా ఉంటే ఈ నెల 10న హైదరా బాద్‌కు పీఎం మోదీ హాజరుకానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో దాదాపు రూ.8,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు హైటెక్స్ వేదికగా శంకుస్థాపనలు, ప్రారంభోత్స వాలను మోదీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నట్లు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు మోదీ వెళ్తారు. అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.






