5 May, 2026 | 5:33 PM

అట్టహాసంగా రైతు వారోత్సవాలు

05-05-2026 04:10 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యాన శాఖ-వ్యవసాయ శాఖ రైతు వారోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. బెల్లంపల్లి పట్టణం పద్మశాలి భవన్ లో మంగళవారం  నిర్వహించారు. ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ పామ్ సాగులో మెలుకువలు, పంట మార్పిడి, మార్కెటింగ్ మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు వారి అనుభవాలు పంచుకోన్నారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ హాజరై మాట్లాడారు. పంట మార్పిడి, ఎరువుల వినియోగం, సేంద్రియ వ్యవసాయం గురించి వివరించారు.