5 May, 2026 | 5:11 PM

రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభం

05-05-2026 04:08 PM

వరంగల్,(విజయక్రాంతి): హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాను మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పంచాయతీరాజ్  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో మేళాను శుభారంభం చేశారు. ఇందులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పనిముట్లు, వాణిజ్య పంటల సాగు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సేంద్రీయ పంటల సాగు తదితర అంశాలపై అవగాహన పెంపొందించే విధంగా కార్యక్రమాలను మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. అలాగే 150 వ్యవసాయ ప్రదర్శనలు ఇందులో ఏర్పాటు చేశారు.