16 April, 2026 | 3:17 AM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

30-11-2025 06:13 PM

తమిళనాడు: తమిళనాడులోని శివగంగా జిల్లా(Sivaganga District)లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరైకుడి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులతో సహ ఓ చిన్నారి కూడా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే సహయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్ర గాయాలు అవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనలో రెండు బస్సులు నుజ్జు నుజ్జు అయ్యాయి.