ప్రాణం తీసిన ఈత సరద

27-04-2024 02:34:54 AM

వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి

యాదాద్రి జిల్లాలో తండ్రీకొడుకులు

రాజన్న సిరిసిల్ల/యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 26(విజయక్రాంతి): ఈత సరదా ప్రాణం తీసింది. శనివారం వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్‌పల్లి మం డలం తడగొండ గ్రామానికి చెందిన చేపూరి గంగయ్య, తిరుమల పెద్ద కుమారుడు మణితేజ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అతడికి ఈత నేర్పించేందుకు తండ్రి గంగ య్య నాలుగు రోజులుగా గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావిలోకి తీసుకెళ్తు న్నాడు. శుక్రవారం ఎలాంటి సాయం లేకుండా ఈత కొట్టాలని కొడుకుకు సూచించాడు. మణితేజ నీటిలో మునిగి గల్లం తయ్యాడు. స్థానికుల సాయంతో గంగయ్య నీటిలో ప్రయత్నించిన ప్రాణాలు దక్కలేదు. 

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం రాయిపల్లికి చెందిన బోడ నరేశ్ (37 ), ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో నివాసం ఉంటు మేస్త్రీ పని చేస్తుండేవాడు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి సొంతూరు రాయిపల్లికి వెళ్లాడు. శుక్రవారం చాడ గ్రామంలో దుర్గమ్మ పండుగకు అతని బందువుల ఇంటికి కొడుకు సాయి(10) తో వెళ్లాడు. పిల్లలకు ఈత నేర్పించే క్రమంలో ప్రమాదవశాత్తు తండ్రీకొడుకులు మృతి చెందారు. వ్యవసాయ బావి వెలుపల ఉన్న మరో కుమారుడు కేకలు వేయడంతో గ్రామస్థులు సహయక చర్యలు చేపట్టారు. అప్పటికే వారు మృతిచెందారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకొని మృతదేహలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. కొడుకు మృతదేహం లభ్యం కాగా, తండ్రి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయి ఆత్మకూర్ ఉన్నత పాఠశాల్లలో 6వ తరగతి చదువుతున్నాడు. తండ్రీకొడుకుల మృతితో గ్రామంలో విషాదం అలుముకున్నది.