లారీ- బైక్ ఢీకొని తండ్రి, కుమారుడు మృతి
05-06-2025 11:59 AM
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్(NTR Circle) లో లారీ-బైకు ఢీకొని తండ్రి, కుమారుడు దుర్మరణం పాలయ్యారు. మృతులు మాజీ సర్పంచ్ అజ్మీర్ బాల్య(40), కుమారుడు సాయికృష్ణ(18) మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) డోర్నకల్ మండలం దుబ్బతండా వాసులుగా గుర్తించారు. కుమారుడిని ఇంటర్ కాలేజ్ హాస్టల్ లో చేర్పించేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి, నిర్లక్ష్యంగా నడపాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






