17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలుగు మెడికో మృతి

05-06-2025 01:48 PM

హైదరాబాద్: వియత్నాంలోని కాన్ థో సిటీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఒక విషాద ప్రమాదంలో 21 ఏళ్ల ఎంబిబిఎస్(MBBS student) మూడో సంవత్సరం విద్యార్థి అర్షిద్ అశ్రిత్ మృతి చెందాడు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణానికి(Kagaznagar town) చెందిన బట్టల వ్యాపారులు అర్షిద్ అర్జున్, ప్రతిమా దంపతుల కుమారుడు అశ్రిత్ తన స్నేహితుడితో కలిసి అతి వేగంగా మోటార్ సైకిల్ నడుపుతుండగా అదుపు తప్పి ఇంటి గోడను ఢీకొట్టాడు. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగింది. ఆశ్రిత్ సంఘటనా స్థలంలోనే మరణించగా, తీవ్ర గాయాలపాలైన మరొకరు చికిత్స పొందుతున్నారు. అశ్రిత్ ఆకస్మిక మరణ వార్త అతని కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ విషాద వార్త విన్న అతని తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అశ్రిత్ మృతదేహాన్ని భారతదేశానికి తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.