01-01-2026 10:42:01 AM
అమరావతి: నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం తుడుముదిన్నెలో దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు పిల్లలకు విషం కలిపిన పాలిచ్చి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను వేములపాటి సురేంద్ర(35), కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్య గగన్(2)గా గుర్తించారు. గతేడాది ఆగస్టు 16 తేదీన అనారోగ్యంతో భార్య మహేశ్వరి(32) ఆత్మహత్య చేసుకుంది. మృతుడు సురేంద్ర నంద్యాల జిల్లాలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. పిల్లలను పెంచలేక దారుణానికి పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.