కూతురిపై తండ్రి అఘాయిత్యం
ఫోక్సో కేసు నమోదు, రిమాండ్
వికారాబాద్, జూలై 30 (విజయక్రాంతి): కన్న తండ్రే తన కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో ఉంటున్న బాలిక కడుపునొప్పితో బాధపడుతూ టీచర్లకు విషయం చెప్పడంతో ఈ దారుణం బయటపడింది. టీచర్ సమాచారం మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ప్రి న్సిపాల్ ఈ విషయాన్ని చైల్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి తెలిపి, బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు జగన్నాథ్ (42) నారాయణఖేడ్‌కు చెందినవాడు. 20 ఏళ్ల వికారా బాద్‌కు వచ్చి ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.
అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె, రెండో భార్యకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో భార్య మరణించడం తో హాస్టల్లో ఉన్న పిల్లలను ఇంటికి తీసు కొచ్చే సమయంలో మూడో కుమార్తెకు మా యమాటలు చెప్పి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని వికారాబాద్ సీఐ రఘుకుమార్ వివరించారు.






