31 July, 2026 | 1:08 AM

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

31-07-2026 12:16 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి

సర్ ప్రక్రియ పరిశీలన

గణపురం, జులై 30 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలనిబిజెపి జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి అన్నారు.గురువారం గణపురం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ప్రత్యేక సవరణ ప్రక్రియపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎడునుతుల నిషిదర్ రెడ్డి మాట్లాడుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అలాగే మండల వ్యాప్తంగా భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. సమావేశం అనంతరం గణపురం తహశీల్దార్ రాజేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసి మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సవరణ ప్రక్రియపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మండల కేంద్రంలోని నూట నలభై ఒకటవ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి బూత్ స్థాయి అధికారిణి ఆలూరి కోమలతో మాట్లాడి అక్కడ జరుగుతున్న ప్రక్రియపై సమగ్ర సమాచారం సేకరించారు. ఈ కార్యక్రమంలో గణపురం మండల ఇంచార్జి శివనాత్రి వేణు, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుప్పటి భద్రయ్య, యువ మోర్చా రాష్ట్ర నాయకులు మంద మహేష్, మండల సీనియర్ నాయకులు బొదుల మొగిలి, మాడిశేటి సాంబశివుడు, గొర్రె రవి యాదవ్ చెలుమల్ల ప్రవీణ్ కుమార్, నూట నలభై ఒకటవ బూత్ అధ్యక్షుడు పెండ్యాల శ్రీకాంత్, యువ నాయకులు జన్నే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.