ఫెడ్‌ఎక్స్ వన్-స్టాప్ షాప్ ప్రారంభం
- డిజిటల్ మార్పు దిశలో ప్రధాన ముందడుగు
- ఫెడ్‌ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ నితిన్ నవనీత్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ప్రపంచంలోని అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీలలో ఒకటైన ఫెడ్‌ఎక్స్.. ‘ఫెడ్‌ఎక్స్ వన్-స్టాప్ షాప్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను సోమవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ నితిన్ నవనీత్ తాటివాలా మాట్లాడుతూ.. ఫెడ్‌ఎక్స్ వన్-స్టాప్ షాప్ ఆర్డర్ మేనేజ్‌మెంట్, బుకింగ్, ట్రాక్ అండ్ ట్రేస్ సేవలను ఒకే వ్యవస్థలోకి తీసుకొచ్చి వ్యాపారాలకు సమగ్ర నియంత్రణను అందిస్తుందన్నారు.
ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఫెడ్‌ఎక్స్‌లో ఒకే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా కార్యకలాపాలను సులభతరం చేయవచ్చునన్నారు. ఫ్రైట్ ఫార్వర్డర్లను విడివిడిగా నిర్వహించే సమస్యలను తొలగిస్తుందని చెప్పారు. అంతేకాకుండా గత షిప్‌మెంట్‌ల రికార్డును నిర్వహించడానికి అనుమతిస్తూ మరింత సమర్థవంతమైన, పారదర్శకమైన లాజిస్టిక్స్ ప్రక్రియను అందిస్తుందని తెలి పారు.
“ఫెడ్‌ఎక్స్ వన్-స్టాప్ షాప్ మా డిజిటల్ మార్పు దిశలో ఒక ప్రధాన ముంద డుగు. ఇది మా విస్తృత రవాణా నెట్‌వర్క్ ద్వారా ఆధారితం.. భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఈ ప్లాట్‌ఫారమ్.. పైలట్ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న వినియోగదారులకు ఇప్పటికే అనేక సదుపాయాలు అందించింది. మేము ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి ఉత్సాహంగా ఉన్నాం” అని నితిన్ నవనీత్ తెలిపారు.






