11 April, 2026 | 5:20 PM

Breaking News

18న ఫెడ్ రేట్ల నిర్ణయం

16-12-2024 12:24 AM

డిసెంబర్ 17,18 తేదీల్లో రెండు రోజులపాటు ఫెడ్ ఫండ్స్ కమిటీ స మావేశం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 18 బుధ వారం అర్థరాత్రి ఫెడ్ నిర్ణయం వెలువడుతుంది. ఈ డిసెంబర్ సమావేశం లో ఫెడ్ ఫండ్స్ రేటును మరో పావుశాతం తగ్గిస్తుందన్న మెజారిటీ అంచ నాలు మార్కెట్లో ఉన్నాయి. అయితే అమెరికా జీడీపీ పటిష్ఠంగా కొనసాగడం, నవంబర్‌లో వినిమయ ధరలు గత ఏడు నెలల్లో ఎన్నడూలేనంత అధికంగా పెరగడం, జనవరిలో చైనా, మరికొన్ని దేశాల దిగుమతులపై డో నాల్డ్ ట్రంప్ టారీఫ్‌లు పెంచే అవకాశం తదితర అంశాలతో 2025లో ఫెడ్ రేట్ల కోతపై అనుమానాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో భవిష్యత్ రేట్ల కోతపై  ఫెడరల్ రిజర్వ్ కమిటీ సభ్యు లు వెల్లడించే సంకేతాల కోసం మార్కె ట్ వేచిచూస్తున్నదని విశ్లేషకులు వివరించారు. ఫెడ్ 25 బేసిస్ పాయింట్ల మేర రేటు తగ్గింపును ఇప్పటికే మార్కెట్ డిస్కౌంట్ చేసుకున్నదని, భవిష్యత్ రేట్లబాటపై ఫెడ్ వ్యాఖ్యానాలపైనే ఇన్వెస్టర్ల దృష్టి నిలిచి ఉన్నదని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు.