8 July, 2026 | 2:24 AM

యూఎస్ మార్కెట్ నుంచి అరబిందో, గ్లెన్‌మార్క్ ఫార్మా ఉత్పత్తుల రికాల్

16-12-2024 12:21 AM

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: తయారీ అంశా ల కారణంగా అరబిందో ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా ఔషధ ఉత్పత్తుల్ని రికాల్ చేస్తున్నట్లు యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్‌ఎఫ్‌డీఏ) తాజా నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కేంద్రం గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ హైపర్ ప్యారాథైరాయిడిజం చికిత్సకు ఉపయోగించే ఒక లక్ష సినాకల్సెట్ బాటిళ్లను రికాల్ చేస్తున్నది. ఎఫ్‌డీఏ సిఫార్సు పరిమితితో పోలిస్తే సినాకల్సెట్ ప్యూరిటీలో వ్యత్యాసాలు ఉన్నందున ఆ ఉత్పత్తిని రికాల్ చేస్తున్నట్లు రెగ్యులేటర్ తెలిపింది. ఇదే కారణంతో  గ్లెన్‌మార్క్ ఫార్మాకు చెందిన యూఎస్ సబ్సిడరీ హై బీపీ చికిత్సకు వాడే 90 వేల డిల్టియాజెమ్ హైడ్రోక్లోరైడ్ బాటిళ్లను మార్కెట్ నుంచి రీకాల్ చేస్తున్నది.