ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే
11-07-2026 02:35 AM
- లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం
- ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించే వరకు తాము వదలిపెట్టబో మని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఆయన పేర్కొన్నారు. శుక్రవా రం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్ అంధాకారంగా మారిందని, ఇప్పటి వరకు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్లు పెం డింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గత కొన్నేళ్లు గా విద్యాశాఖపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శిం చారు. రీయింబర్స్‌మెంట్ విడుదలకాకపోవడంతో ప్రైవేట్ విద్యాసంస్థలు నడవలేని పరి స్థితి ఉందని తెలిపారు.






