నాచారం కాంగ్రెస్ అధ్యక్షుడు నూతలకంటి రాజుకు ఘన సన్మానం
11-07-2026 02:34 AM
ఉప్పల్, జూలై 10 (విజయక్రాంతి): నాచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన నూతలకంటి రాజును హెచ్‌ఎంటీ నగర్ మసీదు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు.
నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ వహా బ్ (ఖదీర్ భాయ్), ఇక్బాల్ సాహెబ్, జావేద్ భాయ్, అక్తర్ భాయ్, ఖాదర్ భాయ్, అబ్దుల్ రావుఫ్, ఇమ్రాన్ సమద్ జావీద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.






