26 August, 2026 | 2:35 AM

ఫీజు బకాయిలు చెల్లించాలి

26-08-2026 01:39 AM
  1. పాత విధానాన్నే కొనసాగించాలి
  2. విద్యార్థుల సమస్యలపై అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి
  3. పెండింగ్ బకాయిలను చెల్లించాలని కలెక్టరేట్ ముట్టడి 
  4. ఎంపీ కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాం తి): బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి, పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు డు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కో రుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వల్లగొర్ల రాందేవ్, ఓయూ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్‌ను వందలా దిమంది  విద్యార్థులు ముట్టడించారు.

ఈ సందర్భంగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ 14 లక్షల మంది విద్యార్థుల ఫీజు బ కాయిలు పెండింగ్‌లో ఉండగా, కోర్సులు పూర్తి చేసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేద ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సుమా రు రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంట నే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 9ను రద్దు చేసి పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ కొనసాగించా లని, విద్యార్థులపై ఒత్తిడి చేయడం ఆపాలని కోరారు.

విద్యార్థుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, బీసీ సంఘాలు, వి ద్యావేత్తలతో ప్రభుత్వం చర్చించాలని డి మాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతా మని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సం ఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్, బీసీ కులాల ఐక్యవేదిక రా ష్ట్ర అధ్యక్షుడు జీ అనంతయ్య, సీ రాజేందర్, చిక్కుడు బాలయ్య, నరేష్ గౌడ్, అంజి గౌడ్, శివ యాదవ్, చిల్లర యశ్వంత్, నరేష్‌చారి తదితరులు పాల్గొన్నారు.