26 August, 2026 | 2:35 AM

రైతు సంక్షేమమే దేశ సంక్షేమం

26-08-2026 01:38 AM
  1. ‘సునహరి మిట్టి అభియాన్’లో గవర్నర్ శుక్లా
  2. నిజామాబాద్‌లో పసుపు రైతులతో ముఖాముఖి

బోధన్, ఆగస్టు 25 (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మంగళవారం నిజామాబాద్‌లోని జాతీయ పసు పు బోర్డు ప్రధాన కార్యాలయంలో ‘సునహరి మిట్టి అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించి పసుపు రైతులతో ముఖాము ఖి నిర్వహించా రు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మె మొంటోలు అందించి అభినందించారు. 

గవర్నర్ శుక్లా మాట్లాడుతూ.. పసుపు సాగులో నిజామాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, సారవం తమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్త గు ర్తింపు లభించిందన్నారు. ఎంపీ ధర్మపురి అ రవింద్ ప్రత్యేక చొరవ, ప్రధాని మోదీ ఆశీస్సులతో ఈ ప్రాంత కల సాకారం అయిం దన్నారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా ఎదగాలనే లక్ష్యంతో జాతీయ పసుపు బోర్డు వెళుతుందని గవర్నర్ స్పష్టం చేశారు. 

సహజ వ్యవసాయం, ఎగుమతు ల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మా త్రమే కాదని, దేశ వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని గవర్న ర్ హర్షం వ్యక్తం చేశారు.

అన్నదాత సుఖీభవ స్ఫూర్తితో ప్రపంచ మార్కెట్‌లో భారత్‌తను అగ్రగామిగా నిలిపే వ్యవసాయ వ్యవస్థను నిర్మిం చాలని శుక్లా పిలుపునిచ్చారు. ఎంపీ ధర్మపురి మాట్లాడుతూ.. రైతుల నాలుగు దశాబ్దాల కల నిజామాబాద్ కేంద్రంగా జాతీ య పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నేరవేర్చిందన్నారు. 

ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, పీ రాకేష్ రెడ్డి, జా తీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్యలు పాల్గొన్నారు. స్వాగతం పలికిన అధికారులకు గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ అరవింద్ పుట్టినరోజు జరుపుకుంటున్న సం ద ర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.