ఫీజు బకాయిలు విడుదల చేయాలి
- సీఎంకు రాంచందర్‌రావు లేఖ
- అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ స్టేట్ చీఫ్
హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి) : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్(Fees reimbursement) బకాయిలు వెంటనే విడుదల చేయాలని కో రుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు సోమవారం బ హిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థుల నుంచి సంత కాల సేకరించిన లేఖలను సీఎంకు అందజేసేందుకు అపాయింట్‌మెంట్‌ను కోరారు. రాష్ట్రంలోని భారీ సంఖ్యలో విద్యార్థులు ఫీ జు రీయింబర్స్‌మెంట్ నిధుల కోసం ఎదురుచూస్తూ ఆందోళన చెందుతున్నప్పటికీ,
ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సానుకూల స్పందన కనిపించడం లేదని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీజే వైఎం ఆధ్వర్యంలో గతంలో సంతకాల సేకరణ చేశారని, ఇప్పుడు ఆ లేఖలను విద్యార్థు లు తమ తరపున అందజేయాలని కోరుతూ సంతకాలు చేశారని తెలిపారు. విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్టు చెప్పారు.






