1 September, 2026 | 3:07 AM

ఏపీ నీటి దోపిడీపై రేవంత్ మౌనం ద్రోహమే

01-09-2026 02:15 AM

కృష్ణా జలాల పరిరక్షణ కోసమే వారం రోజులపాటు నిరసనలు

3న మిర్యాలగూడలో రైతు మహాధర్నా

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 

నల్లగొండ, ఆగష్టు 31 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకు ండా అక్రమంగా కృష్ణా నీటిని తరలిస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం సాగర్ ఆయకట్టు రైతులకు ద్రోహమే నని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.

మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆయన మాట్లాడారు.ఢిల్లీ లాబీయింగ్, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నోరు మెదపడం లేదని ఆరోపించారు. నాగార్జునసాగర్ నీటిని సమర్థవంతంగా వినియో గించుకోకుండా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నారని, ఏపీ నాయకులకు తొత్తులుగా మారిన జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చరిత్రహీనులుగా మిగిలిపోయారని విమర్శించారు.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ నీటి దోపిడీ జరుగుతోందని, రేవంత్, చంద్రబాబు కలిసి సాగర్ రైతులపై కక్షగట్టారని ధ్వజమెత్తారు. వెంటనే సాగర్ ఎడమ కాల్వ, ఏఎంఆర్పీ కింద కృష్ణా నీటిని విడుదల చేయాలని, లేదంటే ‘చలో సాగర్’ పేరుతో సాగర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతుల హక్కులు, కృష్ణా జలాల పరి రక్షణ కోసం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీన మిర్యాలగూడలో కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ రైతు మహాధర్నా నిర్వహిస్తున్నా మన్నారు. సాగర్ ఆయకట్టు రైతాంగమంతా తరలివచ్చి చైతన్యంతో పోరాడాలని, ప్రభు త్వం దిగివచ్చే వరకు ఈ పోరాటం ఆగదని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కరరావు, తిప్పన విజయ్ సింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.